దిగ్విజ‌యంగా సంఘీభావ పాద‌యాత్ర‌
-  8వ రోజు ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభం
- వాడ‌వాడ‌లా విశాఖ వాసుల ఘ‌న స్వాగ‌తం
విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా విశాఖలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టి చేపట్టిన పాదయాత్ర దిగ్విజ‌యంగా కొనసాగుతోంది. బుధవారం 8వ రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. విశాలాక్షినగర్‌ నుంచి విజయసాయిరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు.  వాడ‌వాడ‌ల విశాఖ వాసులు విజ‌య‌సాయిరెడ్డికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతున్నారు. నాలుగేళ్లుగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎంపీ దృష్టికి తీసుకెళ్తున్నారు.


రైల్వేజోన్‌ సాధిస్తాం..
ఈ సంద‌ర్భంగా  ప్రజలను ఉద్ధేశించి విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సైతం స్పష్టం చేశారని గుర్తు చేశారు. విభజన చట్టంలో విశాఖపట్నంకు ఇచ్చిన రైల్వే జోన్‌ను సైతం కేంద్రం విస్మరించిందని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ  తరపున 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. రైల్వేజోన్‌ సాధించి తీసుకు వస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం నుంచి కోలుకోవాలంటే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రత్యేక హోదాతో పాటు, రైల్వే జోన్‌, ఇతర విభజన హామీలను సాధించుకోవాలంటే వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు
 Back to Top