ప్రైవేటు మెంబర్ బిల్లు తేనున్న ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్) పార్టీ
ఫిరాయింపుల మీద రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి,
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లు తేనున్నారు. ఈ మేరకు రాజ్యసభ
సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇచ్చారు. రాజ్యాంగం లోని పదో షెడ్యూల్  మరియు 361బీ రాజ్యాంగ సవరణ చట్టంలో సవరణ కోరుతూ
దీన్ని ప్రతిపాదించారు. పార్టీ ఫిరాయించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని,
తదుపరి కాలంలో మరే పదవి చేపట్టకుండా కట్టుబాటు ఉండాలని కోరుతూ ఈ బిల్లు ప్రతిపాదించారు.  ఈ లేఖ తో పాటు 6 పేజీల బిల్లు డ్రాఫ్ట్ కాపీ ని
రాజ్యసభ కు సమర్పించారు. Back to Top