వైయస్‌ జగన్‌ ప్రకటనతో బీసీల్లో హర్షాతిరేకాలు

–  బీసీలంతా వైయస్‌ జగన్‌కే మద్దతు 
– బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లు

చిత్తూరు: బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో బీసీల్లో హర్షాతికేరాలు వినిపిస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో గురువారం ఆయన పాల్గొని వైయస్‌ జగన్‌తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీసీలంతా కూడా వైయస్‌ జగన్‌కే మద్దతు పలుకుతున్నారని చెప్పారు.  రాష్ట్రంలో 148 బీసీ కులాలు ఉన్నాయని, వారందరికీ న్యాయం చేసేలా మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏరకంగా  జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించారో, అదే ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లును ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రపతి ఆమోదం తరువాత రాజ్యసభకు వస్తుందన్నారు. ఈ విధంగా మా పార్టీ వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా కృషి చేస్తుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు బీసీల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ బీసీలు తమకు మద్దతిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. టీడీపీ పాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని, ఒక్క వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీలకు ఏమైతే చేశారో అవన్నీ కూడా వైయస్‌ జగన్‌ చేస్తారని నమ్ముతున్నారన్నారు. అనిన వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతుగా నిలుస్తున్నారని, వారి సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు.   నవరత్నాలను ఇదివరకే ప్రకటించారని, వాటిలో మార్పులు, చేర్పులపై ప్రజల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. అందరికి తగిన న్యాయం చేసే విధంగా వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.  
 
Back to Top