సీఎం రమేష్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. చర్చకు సిద్ధం

నాలుగు రోజుల్లో బండారం బయటపెడతా
పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న సీఎం రమేష్‌
ఢిల్లీ: నాలుగు రోజుల్లో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ బండారం బయటపెడతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం రమేష్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, ఎక్కడ ఓపెన్‌ డిబేట్‌ పెట్టినా చర్చకు సిద్ధమని, ప్రజలే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని ఎవరు ముందు కలిసి చర్చించాలో బయటపడాలంటే రాజ్యసభ ఫూటేజీని మొత్తం చైర్మన్‌ బయటపెట్టాలన్నారు. ఎవరు కలిసి ఎంతసేపు చర్చించారో ఫూటేజీ చూస్తు తెలుస్తుందన్నారు. సీఎం రమేష్‌ కంటే దుర్మార్గుడు మరొకరు ఉండరని, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాబును మించిన దిట్ట అన్నారు. ఉత్తరాఖాండ్‌లో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నాడన్నారు. ఈ విషయాలన్నీ త్వరలో ఆధారాలతో సహా బయటకు వస్తాయన్నారు. అదే విధంగా సుజనా చౌదరి వల్ల కొన్ని బ్యాంక్‌లు నాశనం అయ్యే స్థితికి దిగజారాయన్నారు. బ్యాంక్‌ల ద్వారా రుణాలు తీసుకొని ఎగ్గొట్టాడని, అదే విధంగా కొన్ని కోట్ల రూపాయల పన్ను కట్టకుండా ఎగ్గొట్టాడని మండిపడ్డారు. సుజనాచౌదరి మోసానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, మారిషస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇవన్నీ దెబ్బతినే పరిస్థితికి దిగజారాయన్నారు. రాజ్యసభ నుంచి సర్టిఫైడ్‌ ఫూటేజ్‌  తీసుకువస్తే ఎవరు మోసం చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ఒకపక్క కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడుతూ.. మరోపక్క కేంద్రమంత్రులతో చీకటి ఒప్పందాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

వీడియో ఫూటేజీ బయటపెట్టాలని ఎంపీ లేఖ 
రాజ్యసభ వీడియో ఫూటేజీని విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఇవాళ్టి   వీయోను బయటపెట్టాలని లేఖలో కోరారు. 
Back to Top