ఏపీకి 90:10 నిష్పత్తిలో ఆర్థిక సాయం చేయాలి


న్యూఢిల్లీ: ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  సభలో ప్రకటించారని, సర్వశిక్ష అభియాన్‌ పథకం కింద ఏపీకి 90:10 నిష్పత్తిలో ఆర్థిక సాయం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. సర్వశిక్షా అభియాన్‌ విలీనంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. విలీనం దృష్ట్యా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రత్యామ్నయం చూపాలని విజయసాయిరెడ్డి కోరారు.  గతంలో మాదిరిగా సాయం చేస్తామని కేంద్ర మంత్రి జవదేకర్‌ సమాధానం దాటవేశారు.  
Back to Top