వైయస్‌ జగన్‌కు పది నియోజకవర్గాలు కానుక ఇద్దాం


నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది నియోజకవర్గాలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఇద్దరు ఎంపీలను గెలిపించి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దామని ఎంపీ వరప్రసాదరావు అన్నారు. నాయుడిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీకు శీరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నానని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఆయన్ను సీఎం కూర్చి నుంచి దించే వరకు మన పోరాటం ఆగకూడదన్నారు. చంద్రబాబు అసమర్ధుడని, కేంద్రంలో భాగస్వామి అయిన వ్యక్తి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, అవినీతిపరుడన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అవినీతి, అసమర్ధత పోవాలని, విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే మత్స్యకారులకు మేలు చేస్తారని, దుగ్గిరాజు పట్నం పోర్టు తీసుకువస్తారని దీమా వ్యక్తం చేశారు. 
 
Back to Top