బలవంతంగా ఎంపీ వరప్రసాద్‌ ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ:

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వరప్రసాద్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో పోలీసులు బలవంతంగా చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 


మేకపాటికి వైయస్ విజయమ్మ పరామర్శ

ఆమరణ దీక్ష చేస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ని వైయస్ ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి టెలిఫోన్ లో మేకపాటి ఆరోగ్యంపై వాకబు చేశారు.


Back to Top