ఎంపీల త్యాగం చరిత్రలో మిగిలిపోతుంది


ఢిల్లీ: నాలుగు సంవత్సరాలుగా అకుంటిత దీక్షతో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. హోదా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చున్నారని, ఎంపీల త్యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఢిల్లీలో ఎంపీలు చేస్తున్న దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు అధికార అహంతో వి్రరవీగుతున్నారని, వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలను చూసి తలదించుకోవాలన్నారు. రాజకీయాలకు నీతి నేర్పే విధంగా వైయస్‌ జగన్‌ ముందడుగు వేస్తున్నారన్నారు. మాటలు దాటేస్తున్న వ్యక్తులు, విలువలు లేని రాజకీయ నేతల చేష్టలకు ప్రజాస్వామ్యం తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు చేతులు కలిసి ఆంధ్రరాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పూటకో సిద్ధాంతం, గంటకో మాట మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్ర ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం చంద్రబాబుపై నడుస్తుంది. ప్రత్యేక హోదాను కాలరాసిన బీజేపీ, టీడీపీలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
Back to Top