టీడీపీ నేతలవి అక్రమాలు..టీడీపీ ఎంపీ రాయపాటి

వినుకొండ  : తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నాయకుల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకులవి అవినీతి, అక్రమాలు అని, అవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసని చెప్పుకొచ్చారు. 
Back to Top