ఎన్నిక‌ల పోలింగ్ లో ఎంపీ పొంగులేటి ఆందోళ‌న‌


ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు పెచ్చుమీరాయి. అనేక చోట్ల టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోయారు. కొన్ని చోట్ల మాత్రం  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓటర్ ఐడీ కార్డులు, నగదుతో పోలింగ్ బూత్లోనికి ప్రవేశించడానికి యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికార పార్టీ కార్యకర్తల తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యకర్తలతో కలసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఐడీ కార్డులు అక్కడ వదిలేసి పరారయ్యారు. ప‌రిస్థితిని అధికారులు అదుపులోకి తెచ్చారు. 
Back to Top