ఎంపీ మిధున్‌ పరామర్శ

కురబలకోట: రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు జిల్లా నేతలను పరామర్శించారు. ఇటీవల గుండె ఆపరేషన్‌ చేయించుకొని చికిత్స పొందుతున్న పార్టీ జిల్లా కార్యదర్శి బైసాని చంద్రశేఖర్‌ రెడ్డి, మండల నాయకులు నందిరెడ్డిగారిపల్లె నులక మనోహర్‌ రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వెంట నియోజక వర్గ సమన్వయ కర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, మలిగి మధుసూధనరెడ్డి, బాబ్‌జాన్, పెద్దమండ్యం రెడ్డిశేఖర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి నులక మనోహర్‌రెడ్డి, కన్వీనర్‌ డిఆర్‌. ఉమాపతిరెడ్డి, నౌషాద్, ఎంపీటీసీ అమరనాథరెడ్డి, పెద్దపల్లె శివారెడ్డి, ఆనంద, అమర, ఖాదర్‌ వల్లీ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top