టీడీపీ కుటిల రాజకీయాలు

 
వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ధ్వజమెత్తారు. పోలవరం నిర్మించడం, ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్‌ సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. పట్టిసీమ పేరుతో కోట్లు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోతిరెడ్డిపాడు నుంచి 46 వేల క్యూసెక్కుల నీరు వచ్చేదని, చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్శించారు.
 
Back to Top