బాబు సర్పంచ్‌ పదవికి కూడా పనికిరాడు

అనుభవం ఉందని మాయమాటలతో ప్రజలను మోసం చేశాడు
హోదా, విభజన అంశాలను కేంద్రానికి తాకట్టుపెట్టాడు
అభివృద్ధి ఢిల్లీ వీధుల్లో ధర్నా చేయాల్సిన ఖర్మ పట్టింది
మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడేది వైయస్‌ఆర్‌ సీపీ ఒక్కటే
వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి
తండ్రి వైయస్‌ఆర్‌లా కేంద్రాన్ని ఆదేశించే వ్యక్తిలా తయారవుతాడు
ఢిల్లీ: రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టిన నీచాతీ నీచమైన చంద్రబాబుకు చిన్న పంచాయతీకి కూడా సర్పంచ్‌గా ఉండే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, అనుభవం కలిగిన వ్యక్తినని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేక హోదా ధర్నా వేదికపై మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పటి వరకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని ఢిల్లీకి వీధులకు వచ్చి ధర్నా చేయాల్సిన ఖర్మ ఏపీ ప్రజలకు పట్టిందన్నారు. 
ఏదో అద్భుతాలు జరిగిపోతున్నట్లు కథనాలు..
రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే.. కాదు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ డిమాండ్‌ చేశారని, ఇప్పుడు వీరి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నా.. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన బీజేపీ చంద్రబాబు నిర్లక్ష్యం ధోరణితో మొండి చెయ్యి చూపిందన్నారు. రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టి ఏదో అద్భుతాలు జరిగిపోతున్నట్లుగా తన పత్రికల్లో రాయించుకుంటున్నారని మండిపడ్డారు. 
వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి..
ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని, హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌ ఒక్కరేనని మేకపాటి అన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు హోదా సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం, ఏప్రిల్‌ 6వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలమంతా రాజీనామా చేస్తామన్నారు. ప్రజల కోసం రాజీనామా చేయడం మాకు దక్కిన సువర్ణ అవకాశమని మేకపాటి అన్నారు. హోదా ఇస్తానని మాటిచ్చిన నరేంద్రమోడీ, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గతంలో దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు అనేక పుకార్లు చేయించారని, కానీ వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపించారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. వైయస్‌ జగన్‌ కూడా తండ్రి బాటలో పయనిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించే నాయకుడిగా తయారవుతాడని మేకపాటి స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top