సబ్బం హరి విమర్శలపై మేకపాటి ఖండన

నెల్లూరు :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి విమర్శలు చేయడంపై నెల్లూరు ఎంపీ, వైయస్ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నెల్లూరులో ఆయన శుక్రవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలు చెప్పిన విధంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని హరి చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆర్టికల్-3ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అధిక శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నా తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ప్రసక్తే ‌ఉండబోదని మేకపాటి స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top