మద్దతు కూడగడతానన్న పవన్‌ ఎక్కడా?

ఢిల్లీ: అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ ఉన్నాడని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని, బాబుకు రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. మొదటి నుంచి ప్రత్యేకహోదా   కోసం పోరాటం చేస్తున్నది వైయస్‌ఆర్‌సీపీనే అని, హోదాపై అనేక మార్లు మాట మార్చిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రావాలని, మేం పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.
 
Back to Top