బాబు సీఎం పదవికి అనర్హుడు

నెల్లూరు:  రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బాబును రాజకీయాల నుంచి వెలివేయాలని ఆయన సూచించారు. మాకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల కోసం పోరాటం చేస్తామని, వైయస్‌ జగన్‌ నేతృత్వంలో హోదా కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమే అని ప్రకటించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతుంది మేమే అన్నారు.  చంద్రబాబుకు ఓటుకు  కోట్లు కేసు భయం పట్టుకుందని విమర్శించారు.
 
Back to Top