చెప్పేవి నీతులు.. చేసేవి దరిద్రపు చేష్టలు

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ నీతి సూక్తులు.. చేసేవన్నీ దరిద్రపు చేష్టలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చుతున్నాడని మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీకి రాజ్యసభ సీటు రాకుండా చేసేందుకే చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభపెట్టి లాక్కుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే ఇలాంటి దరిద్ర చేష్టలను ఖండించాలన్నారు. ప్రజలు కూడా బాబు అరాచకాలను భరించే స్థితిలో లేరన్నారు. 
Back to Top