ఉప ఎన్నికలంటే జంకుతున్నారు


నెల్లూరు: టీడీపీ నేతలు ఉప ఎన్నికలు అంటే జంకుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం స్పీకర్‌తో కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటుకు కోట్లు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకు పుడుతుందన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాహుల్‌తో కలవడానికైనా, మోదీతో జతకట్టడానికైనా బాబు వెనుకాడటం లేదన్నారు. విలువలు లేని పచ్చి అవకాశవాది చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 
 
Back to Top