బాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు

ఢిల్లీ: చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబులో నిజాయితీ ఉంటే సవాల్‌ చేసి ఉండవచ్చు అన్నారు. కానీ..తప్పు చేసిన వారే భయపడుతున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన తర్వాత విలువల గురించి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే బాగుంటుందన్నారు. కనీసం చర్చకు అనుమతించకపోవడం దారుణమన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మా అధినేత వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగా కేంద్రం దిగి రాకపోతే రాజీనామాలకు వెనుకాడమని స్పష్టం చేశారు.

 
 
Back to Top