టీడీపీని ఏపీ ప్రజలు క్షమించరు


న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలు సాధించలేని తెలుగు దేశం పార్టీని ఏపీ ప్రజలు క్షమించరని, చివరకు ఆ పార్టీ కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా క్షమించరని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీవ్ర నిరాశపరిచిందని మేకపాటి అన్నారు. నిజంగా ఏపీకి ఎన్‌డీఏ, దాని భాగస్వామి అయిన టీడీపీ తీవ్ర ద్రోహం చేసిందన్నారు. పరిస్థితులు సరిగా లేవని టీడీపీ మాట మారుస్తుందన్నారు. ఏపీ ప్రజలు మోసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్‌ విభజన  చట్టంలో ఏం పొందుపరిచారో వాటిని నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేసినా ఏపీ ప్రజలు క్షమించరన్నారు.
 
Back to Top