ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు


 
ఢిల్లీ: ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి  మండిపడ్డారు.రెండో రోజు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లో ఉన్న ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గురైనా లెక్క‌చేయ‌డం లేదు. ఈ సంద‌ర్భంగా మేక‌పాటి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల‌ప‌క్షం పేరుతో కొత్త డ్రామాలకు తెరతీశారని ధ్వ‌జ‌మెత్తారు. నాగేళ్లుగా అన్యాయం జరుతున్నా ఏమాత్రం పట్టించుకోని బాబు, ఇప్పుడు అఖిలపక్షం సమావేశం అంటూ హడావిడి చేస్తున్నారంటూ విమర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్‌ వల్లే ప్రత్యేక హోదా డిమాండ్‌ ఇంకా సజీవంగా ఉందన్నారు. రాష్ట్రం కోసం ఎంత‌టి త్యాగానికైనా సిద్ధ‌మే అని మేక‌పాటి స్ప‌ష్టం చేశారు.
Back to Top