చర్చకు నేను సింగిల్‌గా వస్తా..

వైయస్‌ఆర్‌ జిల్లా: చర్చకు నేను సింగిల్‌గా వస్తా.. టీడీపీ నేతలు ఎంతమందైనా రావొచ్చు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. టీడీపీ నేత సతీష్‌రెడ్డి సవాల్‌కు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధపడడంతో కడపలో ఉధృత వాతావరణం నెలకొంది. ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఎంపీతో చర్చలు జరుపుతున్నారు. చర్చకు శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనుకుంటే ‘నేనొక్కడినే చర్చకు వస్తా.. నేను సింగిల్‌గా వెళ్తా.. టీడీపీ వారు ఎంతమందైనా రావొచ్చు’ అన్నారు. మరోవైపు వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. పులివెందుల వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పీఎస్‌కు రావాలని, సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌లోనే హెచ్చరికలకు దిగుతున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top