ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌ని పోరాటం


క‌డ‌ప‌:  నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే పార్టీ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్  జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ను నిర్వ‌హించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయాభిలాషుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్తున్నామ‌ని, 2019లో వైఎస్సార్‌సీపీదే అధికార‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. టీడీపీ కావాల‌నే నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వైఎస్సార్‌సీపీని ప్ర‌జ‌లు గెలిపిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. చంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మాల‌కు త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు శ‌ర‌మ‌గీతం పాడుతార‌ని పేర్కొన్నారు.
Back to Top