మూవీ టీజర్‌ రిలీజ్‌ చేసిన జననేత

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. గొల్లల మామిడాల వైయస్‌ జగన్‌ బస శిబిరం వద్ద సినీ నటుడు ఫృధ్వీ జననేతను కలిశారు. ఈ మేరకు తాను నటించిన మైడియర్‌ మార్తాండం మూవీ టీజర్‌ను జననేత చేత రిలీజ్‌ చేయించారు. సినీ నటుడు ఫృధ్వీ వైయస్‌ జగన్‌ ఆశయాలు, ఆయన చేపట్టిన పాదయాత్రను మెచ్చి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న విషయం విదితమే.
Back to Top