అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు

తిరుపతి: వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని నిప్పులు చెరిగారు.  తిరుపతిలో భూమన మాట్లాడుతూ....తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వెళ్లిన భూమన్, శివారెడ్డి, రాఘవశర్మలను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సర్కార్ నిర్బంధ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అరెస్ట్లు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని భూమన కరుణాకర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top