యువభేరిని జయప్రదం చేయండి

చిలమత్తూరుః ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో జరగనున్న యువభేరి కార్యక్రమానికి  పెద్ద సంఖ్యలో యువకులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని హిందూపురం నియోజకవర్గపు ఇన్‌ఛార్జ్‌ నవీన్‌ నిశ్చల్‌ పిలుపునిచ్చారు. కర్నాటక బాగేపల్లి సమీపంలోని టోల్‌ ప్లాజా వద్దకు అందరూ తరలిరావాలని ఆయన కోరారు. అక్కడ నుంచి పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి కాన్వాయ్‌తో కలిసి అనంతపురం చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
..........................................................
ఆత్మకూరుః వైయస్సార్‌సీపీ పార్టీ వ్యవస్థాపకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగే యువభేరిని జయప్రదం చేయాలని మండల వైయస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు.  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు చేసిందేమి లేదన్నారు . ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం , నిరుద్యోగ భృతి అని నెరవేరని హామీలు చెప్పి మోసం చేశారని తెలియచేశారు. రాష్ట్ర యువత భవిష్యత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లప్పుడు ముందుంటారని తెలియచేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగే యువభేరికి ప్రతి ఒక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు.
...............................................
రాప్తాడుః రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు అనంతపురంలో తలపెట్టిన యువభేరిని విజయవంతం చేయాలని ఆ పార్టీ యూత్‌ మండల కన్వీనర్‌ చిట్రేడ్డి సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు పార్లమెంటు సాక్షిగా అందరూ హామీ ఇచ్చారని, నేడు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో అనేక మంది యువతీ, యువకులు, నిరుద్యోగుల బతుకులు అంధకారంగా మారే పరిస్థితి దాపురించిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మాట మార్చి హోదాతో పెద్దగా ప్రయోజనం ఉండదంటూ రాష్ట్ర భవిష్యత్తును చీకటిమయంగా మార్చుతున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయని, రాయితీలతో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం రాష్ట్ర ప్రయోజనాలను బలిచేయడమేనన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో సీఎంకు తెలిసినా రాష్ట్ర, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. హోదాకు మంగళం పాడి యువత భవిష్యత్తును సీఎం నాశనం చేసాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు, ధర్నాలు ముందుండి చేస్తూనే ఉన్నారని చెప్పారు.
..............................................
విడపనకల్లు: అనంతపురంలో ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించే యువభేరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు తరలి రావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తనయుడు వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం వేల్పుమడుగు, చీకలగురికి,తదితర గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలతోను, యుకువలతోనూ సమావేశం నిర్వహించారు. ప్రత్యేహోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కునువిప్పు కలిగేలా పోరాటం చేస్తూన్నారని,ఇలాంటి సమయంలో జిల్లాలో తలపెట్టిన యువభేరి విజయవంతం చేయాల్సిన బాద్యత మనందరిపైన ఉందని అన్నారు.  మన కోసం మన భవిష్యత్తు తరాల కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేమన్నారు.


తాజా ఫోటోలు

Back to Top