ప్లీనరీకి తరలిరండి

రామగిరిః వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో నిర్వహించనున్న ప్లీనరీ కార్యక్రమానికి రామగిరి మండలం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ మండల కన్వీనర్‌ మీనుగ నాగరాజు తెలిపారు. శనివారం మాదాపురం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిరంకుశ పాలన ప్రజలకు తెలియచెప్పేందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్లీనరీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవనారాయణ, నరేంద్ర, చెన్నకేశవులు, జయచంద్రారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Back to Top