రేపటి ప్లీనరీకి తరలిరావాలి

బొబ్బిలి రూరల్‌: విజయనగరంలో శనివారం నిర్వహించనున్న వైయస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు ఇంటి గోపాలరావు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో గురువారం మాట్లాడారు. జిల్లా కేంద్రంలో జగన్నాథ కల్యాణ మండపంలో నిర్వహించనున్న ప్లీనరీకి పరిశీలకులుగా భూమన కరుణాకరరెడ్డి హాజరు కానున్నట్టు, తొలిసారిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారని తెలిపారు. ప్లీనరీలో తొమ్మిది నియోజకవర్గాల సమస్యలు చర్చిస్తామని, బొబ్బిలిలో జూట్‌ మిల్లుల మూసివేత, గ్రోత్‌ సెంటర్‌లో మూతపడ్డ కార్మికుల సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల రామసుధీర్‌ మాట్లాడుతూ పార్టీకి జిల్లాలో ఆదరణ పెరుగుతోందన్నారు. వారి వెంట నాయకులు పాలవలస ఉమాశంకరరావు, ఇంటి గోవిందరావు, దిబ్బ గోపి, బెల్లాన సూర్యనారాయణ, ఎస్‌.రామకృష్ణ, తేలు తిరుపతి తదితరులు ఉన్నారు.

Back to Top