నవరత్నాల సభకు తరలిరండి

వైయస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌
అడ్డతీగల :రంపచోడవరం ఆర్‌అండ్‌డీ అతిథిగృహం ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్న నవరత్నాల సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని వైయస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ పిలుపునిచ్చారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ రత్నాల్లాంటి తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందన్నారు. నవరత్నాల పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ తెలియజేయడమే ప్రథమ కర్తవ్యంగా పార్టీ శ్రేణులు పనిచేసి, రానున్న ఎన్నికల్లో విజయమే పరమావధిగా పనిచేయాలని ఆయన అన్నారు. దీనిలో బూత్‌కమిటీలు కీలకపాత్ర వహించాల్సి ఉందన్నారు. అలాగే చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా తాత్సారం చేస్తూ ప్రజాసమస్యలను గాలికొదిలేసిన వైనాన్ని ప్రజలకు వివరించడానికి సమాయత్తం కావాలన్నారు. భవిష్యత్‌లో క్యాడర్‌ చేపట్టాల్సిన కార్యాచరణను వివరించడంతో పాటు బూత్‌కమిటీల సభ్యులకు శిక్షణ ఉంటుందన్నారు. బూత్‌ కమిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రానున్న ఎన్నికలకు సమరశంఖం పూరించాలని ఉదయభాస్కర్‌ కోరారు.

Back to Top