స‌మ‌య‌మంతా ఎమ్మెల్యేల కొనుగోలుకే ..!

కడప :  ప్ర‌జ‌ల అవ‌స‌రాలు గాలికి వ‌దిలేసి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం..స‌మ‌యమంతా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకే ప్ర‌య‌త్నిస్తోంద‌ని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషా అభిప్రాయ ప‌డ్డారు. రాయ‌ల‌సీమ‌కు తాగు, సాగు నీరు అందించే గాలేరు - నగరి కాల్వ పనులకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని  ఆరోపించారు. ఆదివారం కడపలో ఎంపీ పి.మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అంజద్బాషా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజాసేవలను విస్మరించారని మిథున్రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కొనడానికి సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీలకు అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్తోనే అని ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పష్టం చేశారు.

Back to Top