కనీసం గంటన్నర సమయం కేటాయించాలి

ఏపీ అసెంబ్లీః గవర్నర్‌ ప్రసంగంపై సభలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి గంటన్నర సమయం ఇవ్వాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పీకర్‌ను కోరారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఆయన మాట్లాడుతూ..వాయిదా సమయంలో మాకు సమయం కేటాయించాలని మా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి మీ వద్దకు వచ్చారు. ఏకైక ప్రతిపక్షం మాది. గవర్నర్‌ ప్రసంగంపై గంటన్నర సేపు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరాం. ఇవాళ జీరో అవర్‌ అన్నది అంత ప్రాధాన్యం కాదు. ప్రతిపక్షం నుంచి ఏకైక సభ్యుడు మాట్లాడుతారని మిమ్మల్ని కోరినా అనుమతించకపోవడం అన్యాయం. చంద్రబాబు ఇచ్చే రిప్లైలు రెండు, మూడు గంటలు ఉన్నాయి. దీనికి మేం ఒప్పుకోవడం లేదు. మాకు సమయం కేటాయించాలి. రూల్‌ గురించి మాట్లాడేటప్పుడు సీఎం టైం కూడా అదే విధానంలో కొనసాగాలి. సీఎంకు ప్రత్యేకం అన్న ఆలోచన సరికాదు. ముఖ్యమంత్రిని పక్కన పెడతామంటే, ప్రతిపక్ష నాయకుడికి అదే టైం ఇవ్వాలి.

Back to Top