మోపిదేవి కుటుంబ స‌భ్యుల‌కు వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్ : ప్ర‌మాదానికి గురైన మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ కుటుంబ
స‌భ్యుల ఆరోగ్య ప‌రిస్థితి గురించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ ఫోన్
లో వాక‌బు చేశారు. హైద‌రాబాద్ నుంచి రావుల పాలెం వెళుతుండ‌గా మోపిదేవి
భార్య‌, కుమార్తె ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది.
విజ‌య‌వాడ‌కు స‌మీపంలో వెనుక నుంచి వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది.
ఈ ఘ‌ట‌న‌లో మోపిదేవి కుటుంబ స‌భ్యులు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వెంట‌నే
వారిని విజ‌య‌వాడ‌లోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయాల క‌న్నా
షాక్ వ‌ల్ల అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని వైద్యులు వెల్ల‌డించారు.

Back to Top