టీడీపీ కుట్రలను తిప్పికొడదాం

రేపల్లెః గ్రామస్థాయి నుంచి వైయస్సార్‌ సీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు వైయస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. ఈ నెల 7వతేదిన పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్న సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ కేడర్‌లో నూతనొత్తేజం నింపేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైయస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించడం, ప్రలోభాలకు గురిచేసి లొంగతీసుకోవటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని, వీటినంన్నింటిని తిప్పికొట్టేందుకు వైయస్సార్‌ సీసీ శ్రేణులు క్రియాశీలంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ప్రజలకు వందలాది వాగ్ధానాలు చేశారని, ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదని గుర్తు చేశారు. 

ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలను మోసం చేసిన విధానాన్ని తెలియజేయడంతో పాటు వైయస్సార్‌ సీపీ భవిష్యత్  కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని చెప్పారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన పాలన జగన్‌తోనే సాధ్యమని గుర్తు చేశారు. పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో 7వతేది ఉదయం 10గంటలకు నిర్వహించే ప్లీనరీ సమావేశానికి పార్టీ జిల్లా ఇన్‌చార్జీ బొత్స సత్యనారాయణ, పలువురు ప్రముఖులు హాజరవుతారని, సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, బూత్‌లెవల్‌ కమిటీ సభ్యులు, ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 
Back to Top