మూడవరోజు కొనసాగుతున్న‌ విజయమ్మ దీక్ష

హైదరాబాద్, 4 ఏప్రిల్‌ 2013: పెంచిన కరెంట్ ఛార్జీ‌లను తక్షణమే తగ్గించాలన్న డిమాండ్‌తో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న 'కరెంట్ సత్యాగ్రహం' మూ‌డవ రోజు గురువారం కొనసాగుతున్నది. గురువారం ఉదయం శ్రీమతి విజయమ్మతో పాటు దీక్షలో కూర్చున్న అందరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీమతి విజయమ్మ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. అహార, పానీయాలు ముట్టకపోవటంతో ఎమ్మెల్యేల ఆరోగ్యపరిస్థితి క్షీణించింది. ఐదుగురు ఎమ్మెల్యేల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గినట్టు వైద్యులు గుర్తించారు.
Back to Top