యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి

వంగవీటి మోహనరంగా 27వ వర్థంతిని గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అంధులు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి శానసభ్యుడిగా గెలుపొందిన నాయకుడు మోహనరంగా అని నేతలు కొనియాడారు.  సమస్యల పరిష్కారం కోసం ఎంతదాకైనా పోరాటం చేయాలని మోహనరంగా నిరూపించారన్నారు. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Back to Top