మోడీ పోటు..బాబు వెన్నుపోటు

  • రక్తం మురిగిపోయిందా బాబు
  • హోదాపై దారుణంగా వంచించారు
  • పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతాం
  • ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
హైద‌రాబాద్‌ః ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల గుండెల‌మీద పొడిస్తే చంద్ర‌బాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ద‌ర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. రైల్వేజోన్ విష‌యంలో సైతం టీడీపీ నాట‌కాలు ఆడుతుంద‌ని కోటంరెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తు లేక‌పోయినా బిల్లును పాస్ చేయ‌డం అత్యంత హేయ‌మైన చ‌ర్య అని, ఇలాంటి పాల‌న దేశంలో ఎక్క‌డ లేద‌న్నారు. దుర్మార్గంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసినంత మాత్ర‌ాన బాబు విజ‌యం సాధించిన‌ట్లు కాద‌న్నారు.  

ప్రత్యేక హోదాపై రెండేళ్లు ఎదురు చూసేలా చేసి దారుణంగా వంచించారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని మండిపడ్డారు. రెండు నెల‌ల క్రితం ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌పై ర‌క్తం మ‌రుగుతుంద‌న్న బాబుకు ..మ‌రి ఇప్పుడు ర‌క్తం మురిగిపోయిందా అని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాపై తమ నాయకుడు వైయస్ జగన్ నేతృత్వంలో ఉద్యమాన్ని  మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. అన్ని పార్టీల మ‌ద్ద‌తుతో, ప్ర‌జ‌ల స‌హకారంతో పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేప‌డుతామన్నారు. ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు వైయ‌స్సార్‌సీపీ అలుపెర‌గ‌ని పోరాటం చేస్తుంద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. 

Back to Top