వైయ‌స్ జ‌గ‌న్ పోరాటాలే గెలిపించాయి అనంతపురం: ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాలే తనను గెలిపించాయని ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన వెన్న‌పూస గోపాల్‌రెడ్డి తెలిపారు . టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప‌ట్ట‌భ‌ద్రులు వైయ‌స్‌ఆర్‌ సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. వైయ‌స్‌ఆర్‌ ఆశయాల కోసం కౌన్సిల్‌లో సమస్యలపై పోరాడతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతు ఉండటం మూలంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. 
స‌త్తాచాటిన వైయ‌స్ఆర్‌సీపీ
 ప్ర‌జాక్షేత్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటింది.అస‌లు సిస‌లైన విజ‌యాన్ని మూట‌క‌ట్టుకోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్న‌పూస గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య త ఓట్లలో గోపాల్‌ రెడ్డికి 53,714 ఓట్లు లభించగా.. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో ‘మ్యాజిక్‌ ఫిగర్‌’గా నిర్ధారించిన 67,887 ఓట్లను.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గోపాల్‌రెడ్డి దక్కించుకున్నారు. 
Back to Top