నీటికి నడక నేర్పిన ఇంజినీర్‌ వైయస్‌ఆర్‌

వైయస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తి కాదు వ్యవస్థ
వైయస్‌ఆర్‌ సీపీ నేత అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస
అనంతపురం: నీటికి నడక నేర్పిన ఇంజినీర్‌ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ నేత అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు అన్నారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైయస్‌ఆర్‌ ఇవాల్టికీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారన్నారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినా ప్రతీ ఒక్కరూ ఆయన్ను స్మరించుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ గొప్ప మానవతావాది అని కొనియాడారు. వైయస్‌ఆర్‌ అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. బడుగు, బలహీనవర్గాలు, విద్యార్థులు, మహిళలు అందరినీ చేరదీశారన్నారు. అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ ద్వారా 68 మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లారన్నారు. 
Back to Top