అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో పవనే చెప్పాలి

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో అనుభవం గల రాజకీయ నేత పవన్‌కల్యాణ్‌ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం మార్చి 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. అదే విధంగా ఏప్రిల్‌ 6వ తేదీన రాజీనామా చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని చెప్పిన పవన్‌ ఇప్పుడు 21న పెట్టడం సరికాదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడు పెట్టాలో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అన్ని కోణాల్లో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందని, ఎవరు ఎన్ని మాట్లాడిన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామన్నారు. 
Back to Top