చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు హాస్యాస్పదం


అనంతపురం :  రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం 2018కి పెద్ద జోక్‌గా ఉందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  రూ.16 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 58,650 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.. దీంతో ఆ తర్వాత నిధులు ఇచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటోందన్నారు. సీఎం నాటకాలను కేంద్రం గుర్తించే నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు కేంద్రం సహకరిస్తే పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 నాటికి పూర్తి చేస్తానని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  
YS Jagan Mohan Reddy, CM Chandrababu Naidu, Polavaram project, YSRCP MLC 
Back to Top