ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ విజయోత్సవ సంబ‌రాలు

గుడిబండ(మడకశిర): పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానం నుండి వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి వెన్నెపూస గోపాల్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. తొలుత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీబీ శివకుమార్, మండల కన్వీనర్‌ రాజన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాబలం కోల్పోయారని, తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్ప‌డింద‌న్నారు. 


 ఎమ్మెల్సీ స్థానం నుండి ఘన విజయం సాధించిన వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి వెన్నెపూస గోపాల్‌రెడ్డిని బుధవారం అనంతపురంలో మడకశిర వైయ‌స్ఆర్ సీపీ నాయకులు కలిసారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వైయ‌స్ఆర్ సీపీ కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, గుడిబండ మండల కన్వీనర్‌ రాజన్న, నియోజకవర్గ నాయకులు శశిధర్, గోపీనాథ్, డీఎల్‌ యంజారేగౌడ్, నాగరాజుగుప్త, ఈరలక్కప్ప, రమేష్, సన్నహనుమప్ప, లింగరాజు, పాతలింగప్ప, రాజన్న, రాహుల్, రంగస్వామి, నాగరాజు, మూర్తి, లక్ష్మీనారాయణ తదితరులు ఆయనను కలిసిన వారిలో వున్నారు.
Back to Top