ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

  • దొడ్డిదారిన గెలవాలని చంద్రబాబు కుట్రలు
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: అవినీతి సొమ్ముతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయం సాధించాలని చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైయస్‌ఆర్‌ వివేకానందరెడ్డి విమర్శించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేకపోయినా ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రలోభాలకు గురిచేసినట్లు  దొడ్డిదారిన ఓటర్లను కొనుగోలు చేయడానికి యత్నిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంగట్లో అమ్మే సరుకులం కాదని రాజకీయ విలువలు గల వైయస్‌ జగన్‌ పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నారన్నారు. ప్రజలను, దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మే వైయస్‌ జగన్‌ స్ఫూర్తితో ఎన్నికల్లో పాల్గొంటున్నామని చెప్పారు.  గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా 200పై చిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top