స్పెయిన్‌ దేశస్థుల మృతిపై ఎమ్మెల్యే విచారం

మదనపల్లె రూరల్ (చిత్తూరు) : రోడ్డుప్రమాదంలో స్పెయిన్‌ దేశస్థులు మృతి చెందిన సంఘటనపై ఎమ్మెల్యే డాక్ట‌ర్ దేశాయ్ తిప్పారెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంకాని దేశంలో సేవ చేసేందుకు వచ్చిన మహనీయులు తిరిగి వారి దేశానికి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురికావడం తననెంతగానో కలిచివేసిందన్నారు. అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ ఫెర్రర్‌ను అక్కడి ప్రజలు దేవుడిగా కొలుస్తారన్నారు. అలాంటి సంస్థకు సహకారమందించేందుకు, దాతృత్వం చూపేందుకు వచ్చిన వ్యక్తులు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. మృతదేహాలను ఆసుపత్రిలో సందర్శించి, వెంటనే వారి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్, ఎస్పీల‌కు సూచించినట్లు తెలిపారు.

Back to Top