వంద‌ల కోట్ల‌తో ఎమ్మెల్యేల కొనుగోలు

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ రూ.వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసినా అధికార పార్టీకే చెందిన స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వైఎస్సార్‌సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీని మీద పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి లోక్ స‌భలో మాట్లాడారు.  ‘‘మేం ఈ బడ్జెట్‌కు సిన్సియర్‌గా మద్దతు పలుకుతున్నాం. కానీ ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి ఫిరాయించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఇది చాలా అనైతికమైన పని, దురదృష్టకరమైన చర్య. దీనిని మనం సరిచేయాల్సి ఉంది. లేదంటే ఇదొక పరిహాసంగా మారుతుంది. ఇదే పార్లమెంటులో మనం చేసుకున్న చట్టాలను మనమే నాశనం చేసుకుంటే ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది సభ్యులు ఉండే సభలో 108 మంది సభ్యులతో ప్రభుత్వం స్థిరంగా ఉంది. మా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ సుస్థిరత పట్ల భయపడాల్సిన పనేమీ లేదు. కానీ మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఒకరొకరిగా ప్రతిరోజు, దినం తప్పించి దినం లాక్కుంటున్నారు. వందల కోట్లు చెల్లించి ఇప్పటివరకు 17 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు జరిపారు’’ అని ఆవేదన పూరితంగా ప్రసంగించారు.

To read this article in English:  http://bit.ly/1UOMA7z 

తాజా వీడియోలు

Back to Top