ఎమ్మెల్యే రోజా ఔదార్యం

* గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను సకాలంలో ఆస్ప‌త్రికి తరలించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శుక్రవారం సింధు అనే మహిళ ప్రమాదవశాత్తూ స్కూటీపై నుంచి పడిపోయింది. అదే సమయంలో రోజా అటువైపుగా వెళుతూ ఈ విషయాన్ని గమనించి ఆగిపోయారు. తీవ్రంగా గాయపడిన సింధును రోజా తన కారులో పూతలపట్టు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. సింధుకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే చొరవతో ఆమెకు సకాలంలో వైద్యులు చికిత్సలు అందించారు. తన కారులో గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రోజాను స్థానికులు ప్రశంసించారు. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన నాయకులంటూ పొగడ్తలతో ముంచేత్తారు.
Back to Top