వైయస్‌ జగన్‌ భరోసాతో కొండంత ధైర్యంఅనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసాతో అనంతపురం జిల్లా ప్రజలకు కొండంత ధైర్యం వచ్చిందని ఊరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 4 నుంచి అనంతపురం జిల్లాలో మొదలైందని చెప్పారు. జననేత ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు, సమస్యలు చెప్పుకున్నారన్నారు. ఆయన ఇప్పుడు అధికారంలో లేరని తెలిసి కూడా, కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.  ఈ జిల్లా ప్రజలు వైయస్‌ జగన్‌ను అమితంగా ప్రేమిస్తార ని చెప్పారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి అవసరమైన లీడర్‌గా అందరూ భావిస్తున్నారని చెప్పారు. కేవలం చదువు వల్లనే ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని వైయస్‌ జగన్‌ భావించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని జననేత పేర్కొన్నారని తెలిపారు. జిల్లాలో వైయస్‌ జగన్‌ 260 కిలోమీటర్లు పైబడి పాదయాత్ర చేశారని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. 
 
Back to Top