ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కాణిపాకంలో నిర్వహిస్తున్న గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఎమ్మెల్యే సునీల్ వాహనాన్ని ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సునీల్ మరో కారులో కాణిపాకం బయలుదేరి వెళ్లారు.

Back to Top