చంద్ర‌బాబుకి పిచ్చి

చిత్తూరు: చ‌ంద్ర‌బాబుకి పిచ్చి ఎక్కువైంద‌ని పూత‌ల‌ప‌ట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సునీల్ కుమార్ విమ‌ర్శించారు. వెంట‌నే ఆస్ప‌త్రిలోచేర్పించి చికిత్స చేయించాల‌ని అన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమని  ఆయ‌న అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను చూసే ప్రజలు మమ్మల్ని గెలిపించారని చెప్పారు. 
Back to Top