హైదరాబాద్) రైతులకు ఇచ్చే నష్ట పరిహారం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు సుజయ్ క్రిష్ణ రంగారావు శాసనసభ నోటీసులోకి తెచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం లో భాగంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఒక నిబంధన, విజయనగరం జిల్లా లో మరో నిబంధన అమలు చేస్తున్నారని ఆయన ప్రస్తావించారు. అంతే గాకుండా గీత కార్మికుల సమస్యల్ని పట్టించుకోవటం లేదని చెప్పారు. దీని మీద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇచ్చారు.