కృష్ణా జలాల కోసం శ్రీకాంత్‌రెడ్డి పాదయాత్ర


వైయస్‌ఆర్‌ జిల్లా: కృష్ణా జలాలు వైయస్‌ఆర్‌ జిల్లాకు ఇవ్వాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మూడు రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. వెల్లిగల్లు, శ్రీనివాసపురం, జరికోన ప్రాజెక్టులకు కృష్ణా జలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లె నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఆయనకు పార్టీ నేతలు, రైతులు మద్దతు తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top